ప్రకాశం: ఒంగోలు సమీపంలోని పేస్ కాలేజీ వద్ద బస్సు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లిన ఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు చెందిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు 15 మంది మినీ బస్సులో విజయవాడకు బయలుదేరారు. ఈ బస్సు ఒంగోలు సమీపానికి రాగానే అదుపుతప్పింది. ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు.