SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నదీ పక్కన కొలువైయున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ఆశ్వీజ మాసం కృష్ణపక్షం సప్తమి సోమవారం జలపాలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే స్వామిని శుభ్రం చేసి పూజలు హారుతులు అందించాక భక్తులు నీలకంటేశ్వర స్వామికి పూజలు చేపట్టారు. పూజకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు.