ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం శివుడికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామున సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మహా శివునికి ప్రత్యేక పుష్పాలతో అలంకరించి స్వామివారిని భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.