CTR: ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తవణంపల్లి మండలంలో గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రోడ్లపై భారీగా నీరు చేరింది. మండలంలో అన్ని చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తొడతర, గాజులపల్లి, మత్యం, జొన్న గురకల, పుణ్య సముద్రం, కాణిపాకం, గ్రామాల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు.