ATP: తాడిపత్రిలో జరిగిన ఓ వేడుకలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత సాకే శైలజనాథ్ కలిశారు. వేరు వేరు పార్టీలకు చెందిన వారు ఆప్యాయంగా పలకరించుకోవడాన్ని అక్కడి వారు ఆసక్తికరంగా తిలకించారు. ఈ సందర్భంగా సాకే శైలజానాథ్ ఆరోగ్యంపై ప్రభాకర్ రెడ్డి ఆరా తీశారు. రాజకీయాలకు అతీతంగా ఇలా మాట్లాడుకోవడం శుభ పరిణామమని స్థానికులు అభిప్రాయపడ్డారు.