మేడ్చల్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం పీఎస్ పరిధిలోని సాయిబాబా నగర్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన బైక్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న సాయికుమార్ (38) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.