NLR: కందుకూరు (M) కోవూరు గ్రామ శివారులో ఆదివారం రాత్రి గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. కందుకూరు రూరల్ ఎస్ఐ మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పాత అంగన్వాడీ భవనంలో పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు తెలిసింది.దాంతో ఆకస్మిక దాడి చేయగా 10 మందిని అరెస్ట్ చేసి రూ.6450 నగదును, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.