MLG: తాడ్వాయి మండలం మేడారం జాతర పనుల సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇవాళ హాజరుకావట్లేదు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విభేదాల కారణంగా ఆమె ఈ సమావేశానికి రావట్లేదని తెలుస్తోంది. మేడారం అభివృద్ధి పనుల టెండర్ల పై మంత్రుల మధ్య గొడవలు నెలకొనడంతో సురేఖ టూర్ షెడ్యూల్ విడుదల కాక, సమీక్షకు గైర్హాజరైనట్లు సమాచారం.