విశాఖ: మన్మథరావు మెమోరియల్ క్లబ్ నిర్వహించిన బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులు చిత్తశుద్ధితో ఎదిగి తల్లిదండ్రులు, గురువుల నమ్మకాన్ని నిలబెట్టాలని ఆయన కోరారు. ఈ టోర్నమెంట్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ గర్ల్స్ టీమ్ విజేతగా, సెయింట్ అల్లోయిసిస్ స్కూల్ రన్నర్‌గా నిలిచాయి.