NLR: కందుకూరు మండలం ఓగూరులో రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో నిర్మించిన PHC భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. అదే విధంగా రూ. 10 లక్షల నిధులతో డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఓగూరుకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తానని MLA హామీ ఇచ్చారు.