Daughter: ఐటీ హబ్ బెంగళూరులో దారుణం జరిగింది. ఓ కూతురు తన తల్లిని హతమార్చింది. ఆమె శవాన్ని సూట్ కేసులో కుక్కి.. పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చింది. హత్యకు గల కారణం వివరించడంతో పోలీసులు నిర్ఘాంత పోయారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మైకో లేఅవుట్ పోలీసు స్టేషన్ పరిధిలో సోనాలి సేన్ (sonalisen) కుటుంబం ఉంటుంది. వీరి స్వస్ధలం కోల్ కతా కాగా.. ప్రొఫెషన్ రీత్యా ఇక్కడే ఉంటున్నారు. సోనాలి సేన్ (sonalisen), ఆమె భర్త, కుమారుడు, అత్తమ్మ, సోనాలి తల్లి కలిసి ఓకే ప్లాట్‌లో ఉంటున్నారు. ఇంటిలో అత్త, తల్లికి తరచూ గొడవలు జరుగుతుండేవట. ఇంకేముంది ఓ బలహీన క్షణంలో సోనాలి బలమైన నిర్ణయం తీసుకుంది.
ఉదయం 7 గంటలకు
సోమవారం ఉదయం 7 గంటలకు తన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చిందట.. ఉదయం 11 గంటల సమయంలో నిద్రమత్తులో కడుపునొప్పితో తల్లి విలవిల లాడింది. పడుకున్న చోటుకు వచ్చిన సోనాలి (sonali).. తల్లి మొహన్ని దిందుతో అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసింది. చనిపోయిందని నిర్దారించుకున్న తర్వాత మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి ఉబర్ క్యాబ్‌లో పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి లొంగిపోయింది. తన తల్లిని చంపేశానని చెప్పింది. ఎందుకు హత్య చేశానో వివరించింది.
తల్లినే హత్య చేసి
సోనాలి సేన్ (sonalisen) తల్లి, ఆమె అత్తతో గొడవ పడుతుందట. దీంతో విసిగిపోయింది. ఏం చేయాలా అని ఆలోచించింది. భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత మట్టుబెట్టాలని నిర్ణయం తీసుకుంది. పైకి మాత్రం మరొ కారణం చెబుతోంది. అయినా సొంత తల్లిని హతమార్చేందుకు ధైర్యం ఎలా వచ్చిందనే ప్రశ్న వస్తోంది. దట్ టు.. తల్లి తన వద్దే ఉంటుంది. ఆమెకు భర్త, ఇతరులు ఎవరూ లేరు. నీడ కోసం వచ్చిన తల్లినే చంపేసి.. చేతులు దులుపుకుంది.
ఆమెనే చంపమని కోరిందట
పోలీసులకు మాత్రం ఇలా చెప్పింది. ‘తల్లే చంపేయమని కోరింది. అమ్మ తన భర్త వద్దకు వెళ్తానని చెప్పింది. ఆయనతో ప్రశాంతంగా ఉంటానని అంది. తనను చంపాలని కోరడంతో అలా చేశానని అంటోంది. తొలుత నిద్రమాత్రలు ఇచ్చానని.. తర్వాత మూర్చ రావడంతో ఊపిరి ఆడకుండా చేసి చంపేశాను అని’ సోనాలి (sonali) చెప్పింది. ఆమె చెప్పిన మాట విని.. పోలీసులు షాక్‌నకు గురయ్యారు.