ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిన్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినట్లు అధికారులు తెలిపారు. 7 మండలాల్లో కలిపి సర్పంచ్లకు 438, వార్డులకు 556 మంది వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కాగా ఈ నెల 11న జరిగే తొలి విడత ఎన్నికల్లో 7 మండలాల్లో కలిపి 192 స్థానాల్లో సర్పంచ్, 1740 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.