KRNL: ఆదోని పట్టణ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల నిఘా దెబ్బతింది. మొత్తం 47 కెమెరాల్లో రిపేర్ కారణంగా ప్రస్తుతం 16 మాత్రమే పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. పట్టణంలో దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో, కేసుల దర్యాప్తు కోసం సీసీ కెమెరాలు కీలకం కావడంతో వీటి మరమ్మతులకు తక్షణ చర్యలు అవసరం. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.