»A Woman Who Cheated A Businessman In The Name Of Mla Ticket
MLA టికెట్ పేరుతో మోసం.. రూ.5 కోట్లు వసూల్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని పారిశ్రామికవేత్త గోవిందబాబు పూజారిని మోసం చేసిన చైత్రా కుందాపురతోపాటు మరో ఆరుగురిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
A woman who cheated a businessman in the name of MLA ticket
MLA ticket: ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఓ పారిశ్రామిక వేత్తను సామాజిక కార్యకర్త మోసం చేశారు. అప్పటి అధికార పార్టీ నుంచి టికెట్ ఇప్పిస్తానని నమ్మబలికింది. బీ ఫామ్ కోసం రూ.5 కోట్ల వరకు దండుకొని.. టికెట్ విషయం అడిగితే కల్లబొల్లి కబుర్లు చెప్పింది. మోసం పోయానని గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం తెలిసింది.
ఏం జరిగిందంటే..?
బైందూరు నియోజకవర్గం నుంచి బీజేపీ (bjp) తరఫున పోటీ చేసేందుకు పారిశ్రామిక వేత్త గోవిందబాబు పూజారి (govindababu) ఇంట్రెస్ట్ చూపించారు. బీజేపీ పెద్దలతో లింక్ ఉన్న వారిని కలిసేందుకు ట్రై చేశాడు. సరిగ్గా అప్పుడే చైత్రాకుందాపుర సీన్లోకి ఎంటరైంది. పూజారి (pujari) వీక్ నెస్ తెలుసుకుంది. తనకు ఆర్ఎస్ఎస్ పెద్దలు తెలుసు అని.. పీఎంవోలు (pmo) పరిచయాలు ఉన్నాయని బిల్డప్ ఇచ్చింది. చిక్కమంగళూరుకు పూజారిని తీసుకెళ్లి విశ్వనాథ్ (vishwanath) అనే వ్యక్తిని పరిచయం చేసింది. అక్కడ ఆహో, ఓహో అన్నట్టు మాటల వ్యవహారం సాగింది. ఇంకేముంది వారిని పూజారి నమ్మేశాడు.
రూ.5 కోట్లు వసూల్
టికెట్ (ticket) కోసం డబ్బులు దండుకోవడం మొదలెట్టింది. మూడు విడతలుగా రూ.5 కోట్ల నగదు వసూల్ చేసింది. ఎన్నికల సమయం దగ్గర పడింది. టికెట్ గురించి పూజారి అడగడం స్టార్ట్ చేశాడు. మెల్లిగా మార్చి 8వ తేదీన ఫోన్ చేసి విశ్వనాథ్ (vishwanath) చనిపోయాడని షాకింగ్ న్యూస్ చెప్పింది. అప్పటికే పూజారికి అనుమానం వచ్చింది. కశ్మీర్లో ఉన్న స్నేహితుడు, రిటైర్డ్ ఆర్మీ అధికారి యోగేశ్‌కు ఫోన్ చేసి విశ్వనాథ్ గురించి చెప్పాడు. అతను ఆరా తీసి.. విశ్వనాథ్ ఎవరూ లేరని చెప్పాడు. దీంతో చైత్రకుందాపురకు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమని అడిగారు. అప్పటికీ ఆమె ఓ సారి సూసైడ్ అటెంప్ట్, మరోసారి సమయం అడిగింది.
కంప్లైంట్
టికెట్ రాలేదు.. రోజులు గడుస్తున్నాయి. డబ్బులు ఇవ్వమంటే రోజుకో కహానీ చెబుతోంది. ఇక లాభం లేదనుకొని బండెపాళ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఆచూకీ కోసం సీసీబీ పోలీసులు తీవ్రంగా గాలించారు. చైత్రాకుందాపుర, గగన్ కడూర్, శ్రీకాంత్ నాయక్, ప్రసాద్ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉడుపి నుంచి బెంగళూర్ తీసుకెళ్లారు. బెంగళూర్ ఒకటో ఏసీఎంఎం కోర్టులో హాజరు పరిచారు. ఈ నెల 23వ తేదీ వరకు కస్టడీలోకి తీసుకున్నారు. పూజారిని మోసం చేసిన కేసులో మూడో నిందితుడు స్వామి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.