ప్రధాని నరేంద్ర మోదీ వాట్సాప్ ఛానెల్లోకి ఎంటర్ అయ్యారు. ఇదొక ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పరిచయం చేసిన సరికొత్త ఫీచర్ అని చాలా మందికి తెలియదు. వాట్సప్ తమ యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా వాట్సాప్ ఛానెల్ అనే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. దీని సహాయంతో ప్రజలు వన్-వే ప్రసార ఛానెల్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఒకేసారి చాలా మందితో ఈ ఫీచర్ ద్వారా కనెక్ట్ కావొచ్చు.
దీని ద్వారా వాట్సాప్‌లో ప్రధాని మోదీకి సంబంధించిన అప్డేట్లు, పోస్ట్‌లను చూసేయవచ్చు. క్రికెటర్లు, సెలబ్రిటీలు ఈ వాట్సాప్ ఛానెల్‌తో కనెక్ట్ అయ్యారు. తాజాగా ప్రధాని మోదీ కూడా ఈ వాట్సాప్ ఛానెల్లో ఎంటర్ అయ్యి తన పోస్ట్‌ను షేర్ చేశారు. వాట్సాప్ సంఘంలో చేరినందుకు థ్రిల్ గా ఉందని, తన నిరంతర ప్రయాణంలో ఇది మరో మెట్టు అని తెలిపారు. కొత్త పార్లమెంటు భవనం ఫోటోను కూడా షేర్ చేశారు.
మీరు ప్రధాని మోదీ వాట్సాప్ ఛానెల్లో చేరాలనుకుంటే https://www.whatsapp.com/channel/0029Va8IaebCMY0C8oOkQT1F లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు చాటింగ్ లాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తే ఫాలో ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ప్రధాని మోదీ వాట్సాప్ చాట్ చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ పరికరాల్లోనే ఉంది. ఐఫోన్, ఐపాడ్లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఆండ్రాయిడ్‌లో మాత్రం కాస్త ఆలస్యంగానే ఫీచర్ రానుంది. ఇతర ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు.