»No Group Politics In Congress Partykomatireddy Venkat Reddy
komatireddy venkat కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు లేవు, నల్గొండ నుంచి బరిలోకి దిగుతా
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించారు.
komatireddy venkat reddy:కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు లేవని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) అన్నారు. అంతా కలిసి పనిచేస్తాం అని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ (nalgonda) నుంచి పోటీ చేస్తానని స్పష్టంచేశారు. ఇప్పుడు అక్కడినుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి (uttam) ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్, కోదాడలో కాంగ్రెస్ పార్టీ 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తోందని గతంలో ఉత్తమ్ (uttam) ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.
నల్గొండ నియోజకవర్గంలో ఈ రోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy) పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ (nalgonda) జిల్లాలో 12 సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. ఈ నెల 28వ తేదీన నల్గొండ (nalgonda) జిల్లాలో చేపట్టే నిరుద్యోగ నిరసన దీక్షకు సంబంధించి తనకు సమాచారం అందిందని తెలిపారు. ఆ దీక్షలో పాల్గొంటానని వివరించారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) పాదయాత్ర జరుగుతోందని.. ఆ యాత్ర కోసం ప్రియాంక గాంధీని (priyanka gandhi) తీసుకొస్తానని తెలిపారు. జూన్ ఫస్ట్ వీక్లో ప్రియాంక గాంధీ (priyanka gandhi) రాష్ట్రంలో పర్యటన ఉంటుందని తెలిపారు.
నల్గొండ నియోజకవర్గం కోసం తాను ఎప్పుడూ ముందుంటానని వెంకట్ రెడ్డి తెలిపారు. 4 వేల మంది ఉన్న మహిళా డిగ్రీ కాలేజీలో రెండు బాత్రూమ్స్ మాత్రమే పనిచేస్తాయని మండిపడ్డారు. తన సొంత డబ్బులతో బాగు చేయించానని.. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. నల్గొండలో బలగం సినిమా షో వేస్తే 40 వేల మంది వరకు వచ్చి చూశారని కూడా కోమటిరెడ్డి తెలిపారు. కోదాడ, హుజూర్ నగర్లో 50 వేల కన్నా ఒక్క ఓటు తక్కువ వచ్చిన రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ అన్న సంగతి తెలిసిందే. తనకు ఉత్తమ్ కన్నా ఒక ఓటు ఎక్కువే వస్తోందని వెంకట్ రెడ్డి వివరించారు. కోదాడ, హుజూర్ నగర్ అసెంబ్లీ నుంచి ఉత్తమ్, ఆయన భార్య పద్మావతి బరిలో ఉంటారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఇప్పుడు ఉత్తమ్ ఛాలెంజ్ చేశారు. ఉత్తమ్ మాదిరి తాను ఛాలెంజ్ చేయనని.. తనకు ఒక ఓటు ఎక్కువే వస్తోందని వెంకట్ రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్పై విమర్శలు చేశారు. నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పి ఏం చేశారని అడిగారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో తలో 20 వేల డబుల్ బెడ్ రూమ్స్ నిర్మించారు. మరీ నల్గొండ పరిస్థితి ఏంటీ అని అడిగారు. గ్యాదరి కిశోర్ వాళ్ల తండ్రి చనిపోయిన సందర్భంలో మెయిన్ రోడ్ వేసి.. ప్రచారం చేసుకున్నారని గుర్తుచేశారు. ఇక్కడికి వస్తా.. కూర్చొని ఉంటానని కేసీఆర్ ఎక్కడ అని అడిగారు. బండ సరేందర్కు షుగర్ వచ్చి కాలు తీసిన.. ఈ వైపు చూడలేదని గుర్తుచేశారు.