పార్సిల్ డెలివరీని ఓలా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో పార్సిల్ డెలివరీని ప్రారంభించింది. తర్వాత దేశంలోని మిగతా నగరాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది.
Ola Parcel Service: ఓలా (ola) అంటే క్యాబ్ బుకింగ్ సంస్థ.. తర్వాత బైక్ రైడ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మరో రంగంలోకి ప్రవేశించింది. పార్సిల్ డెలివరీ చేస్తామని ప్రకటన చేసింది. తొలుత ఐటీ హబ్ బెంగళూర్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత మిగతా నగరాలకు విస్తరిస్తామని కంపెనీ చెబుతోంది.
బెంగళూరులో ఓలా పార్సిల్ డెలివరీ (ola Parcel Service) సేవలను అందుబాటులోకి వచ్చాయి. ఆ పార్సిల్ చేసే దూరాన్ని బట్టి ధర ఉంటుంది. పార్సిల్ చేసే రైడర్ విధిగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉపయోగిస్తారని కంపెనీ స్పష్టంచేసింది. 5 కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25 తీసుకుంటారు. 15 కిలోమీటర్ల దూరం అయితే రూ.75, ఇక 20 కిలోమీటర్ల దూరం తీసుకుంటే రూ.100 చార్జీ వసూల్ చేస్తామని ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ తెలిపారు.
బెంగళూరులో అందుబాటులో ఉన్న సేవలను తర్వాత దేశంలో గల ఇతర నగరాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. ఓలా పార్సిల్ వల్ల సిటీలో కొందరు కొన్ని డాక్యుమెంట్స్ లేదంటే వస్తువులను ఈజీగా పంపించే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ఓలా తక్కువగానే ఛార్జీ చేస్తోంది. అందుకోసం వినియోగ దారుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.