దేశీయ విమాన టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. హైదరాబాద్-ఢిల్లీ విమాన టికెట్ ధర రూ.89 వేలు పలుకుతోంది. ఢిల్లీ-ముంబై టికెట్ ధర రూ.40 వేలు, హైదరాబాద్-విజయవాడ టికెట్ ధర రూ.18 వేలుగా ఉంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.