విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయంతో వందల సర్వీసులు రద్దు, ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘క్షమించండి.. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం’ అని ఇండిగో ట్వీట్ చేసింది. డిసెంబర్ 5-15 మధ్య ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకుని, ఈ అంతరాయాల కారణంగా వాటిని రద్దు లేదా రీషెడ్యూలింగ్ చేసుకుంటే పూర్తి రీఫండ్ ఇస్తామని తెలిపింది.