W.G: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను బలోపేతం చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ చెప్పారు. శుక్రవారం ఇరగవరం మండలం రేలంగి జడ్పీ హైస్కూల్ ఆవరణలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు.