ADB: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శుక్రవారం ఉదయం ఉట్నూర్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మెస్రం భాగ్యలక్ష్మికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. బెండకాయ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సినియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.