AKP: ప్రజలు ఇంటి పనులను ఆన్లైన్లో చెల్లించాలని ఎస్.రాయవరం మండల డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. పెదగములూరు గ్రామంలో ఆన్లైన్లో ఇంటి పన్నులు చెల్లించిన వారికి శుక్రవారం రసీదులు అందజేశారు. శతశాతం ఇంటి పనులు చెల్లించాలని సూచించారు. ప్రజలు కట్టే ఇంటి పన్నులు పంచాయతీలను అభివృద్ధి చేయడానికి దోహదపడతాయన్నారు.