AP: చదువే బలమైన ఆయుధమని.. లక్షలాది మెదళ్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే ఉందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పిల్లల జీవితాలను ఉపాధ్యాయులే ఎక్కువ ప్రభావితం చేస్తారని తెలిపారు. అలాగే, చిలకలూరిపేట శ్రీశారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో గ్రంథాలయంతో పాటు 25 కంప్యూటర్లను తన సొంత ఖర్చుతో సమకూరుస్తానని పవన్ హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆడుకునేందుకు తగిన స్థలం చూడాలని అధికారులను ఆదేశించారు.