MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విందు, వినోద కార్యక్రమాలు పోటాపోటీగా నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా చికెన్, మటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు సమాచారం. పల్లెల్లో నేతలు, అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు.