VZM: 100 రోజుల పనిదినాల కల్పనలో వెనుకబడిన మండలాలపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల కల్పనపై శుక్రవారం వీసీ నిర్వహించారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస మండలాలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రగతి చూపని మండలాల్లో పనులను వెంటనే వేగవంతం చేయాలని, వేతనం రూ.300కి తగ్గకుండా పనులు కల్పించాలని సూచించారు.