టీమిండియా మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ నవంబర్ నెలకు గాను ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేస్‌లో నిలిచింది. గత నెలలో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చేసిన ఆల్‌రౌండ్(87 రన్స్, 2 వికెట్లు)తో ఆమె ఈ అవార్డుకు నామినేట్ అయ్యింది. అలాగే, థాయ్‌లాండ్ స్పిన్నర్ తిపట్చా పుట్టావాంగ్, UAE ఆల్‌రౌండర్ ఇషా ఓజా కూడా ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు.