NTR: వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పాల్గొన్నారు. విద్య అనేది ప్రతి కుటుంబం భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని, ప్రతి పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.