JGL: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామంలో యువత, అభ్యర్థులు, గ్రామస్తులతో సారంగాపూర్ ఎస్సై గీత సమావేశం నిర్వహించారు. ఎన్నికల నియామవాలిపై అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.