TG: స్వరాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారమవుతాయని వరంగల్ ప్రజలు ఆశించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కుర్చీలో కూర్చున్న వారి ఆస్తులు పెరిగాయి.. కానీ, ప్రజల జీవితాలు మారలేదన్నారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని ఆనాటి సీఎం కేసీఆర్ అన్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం చివరి గింజ వరకు కొంటోందన్నారు. సాగుకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు.