తిరుపతి జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్య శాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో చిత్తూరు ముందంజలో ఉండడం ఆందోళనకు గురిచేస్తోందని ఎంపీ తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.