TG: మీ ఓటునే ఆయుధంగా మార్చి.. గడీల పాలనను కూల్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతోందని గుర్తుచేశారు. అంతకుముందు సీఎం నర్సంపేటలో రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ గడ్డకు చెందిన ఎందరో వీరులు తమ పరాక్రమాన్ని ప్రపంచానికి చూపారని, కాకతీయ యూనివర్సిటీ పోరాటాలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని తెలిపారు.