TG: ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్షించారు. వర్సిటీ అభివృద్ధి కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. మరమ్మత్తుల కంటే కూడా నూతన భవనాల నిర్మాణంపై దృష్టిపెట్టాలని సూచించారు. విద్యార్థుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని చెప్పారు. ఈనెల 31న పూర్తి ప్రణాళికను ప్రకటించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే, ఈనెల 10న OUను సందర్శిస్తానని CM తెలియజేశారు.