SS: సోమందేపల్లిలో అయ్యప్ప స్వాములు శుక్రవారం గంగ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా మారుతీనగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు ముస్లిం మైనారిటీ సోదరులు అన్నదానం చేశారు. హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో అన్నదానం చేసినట్లు ముస్లింలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులకు అయ్యప్ప స్వాములు కృతజ్ఞతలు తెలిపారు.