బైక్ రైడర్లకు శుభవార్త చెప్పింది ఓలా కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను అద్దెకు ఇచ్చి నెలకు రూ. 70వేలను సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన ఆఫర్‌ను ప్రకటించింది.
Ola Bike: ఏంటి బైక్‌రైడ్ చేస్తూ నెలకు రూ. 70 వేలు సంపాదించొచ్చా అని ఆశ్చర్యంగా అనిపిస్తుందా.. అది సాధ్యమే అంటోంది ఓలా కంపెనీ. క్యాబ్ సేవల్లో ఊబర్(Uber), ఓలా రెండు సంస్థలు దశబ్దకాలంగా సర్వీస్ అందిస్తున్నాయి. వీటితో పాటు బైక్ సేవలను మార్కెట్లోకి తీసుకొచ్చి పెద్ద సంచలనాలకు తెరలేపాయి. బైక్ ట్యాక్సీలో ర్యాపిడో టాప్ ప్లేస్‌లో ఉంది. బైక్ ట్యాక్సీలో కూడా దిగ్గజ సంస్థగా ఎదగాలని ఓలా ప్రయత్నిస్తోంది. గత నెలలో బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలు ప్రారంభించింది. తమ కంపెనీకి ఎక్కువ మంది బైక్ డ్రైవర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నెలకు రూ.70వేల వరకు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్తుంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అన్ బోర్డింగ్ సెంటర్ వద్ద దీనికి సంబంధించిన పెద్ద బ్రౌచర్‌ను ప్రదర్శిచింది.
బైక్ రైడర్లు ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ తో ట్యాక్సీ సేవలు అందించొచ్చని ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో భవీష్ అగర్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. బైక్ ట్యాక్సీపై ఆసక్తితో ఉన్న యువతను ఆకర్షించేందుకు కేవలం రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్‌తో, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను అద్దెకు ఇస్తోంది. మొదటి ఐదు కిలోమీటర్లకు ఓలా బైక్ ట్యాక్సీ కస్టమర్ల నుంచి రూ.25 చార్జీ వసూలు చేస్తోంది. మొదటి పది కిలోమీటర్లకు ఈ చార్జీ రూ.50గా ఉంటుందని గత నెలలో సేవల ప్రారంభించిన సమయంలో భవీష్ ప్రకటించారు. కొద్దిరోజుల్లో వీటిని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని వెల్లడించారు.