»Gold Rate Rs 750 Silver Rs 500 Increase In Delhi India Four Month High Gold Rates
Gold rate Increase: వామ్మో 4 నెలల గరిష్టానికి గోల్డ్..ఎంతకు చేరిందంటే
విదేశీ మార్కెట్లలో గోల్డ్ రేట్లు(Gold rates) పెరిగిన నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో గోల్డ్ ధర భారీగా పెరిగింది. ఈ క్రమంలో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.750 పెరిగి రూ.61,650కి చేరుకుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ తెలిపింది. అంతకుముందు 10 గ్రాములకు రూ.60,900 వద్ద ఉండేది.
gold rate today hyderabad and vijayawada december 24th 2023
బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు(gold rates) పెరిగిన నేపథ్యంలో శుక్రవారం దేశంలోని బంగారం, వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగింది. మరోవైపు వెండి కూడా కిలోకు రూ.500 పెరిగింది. అయితే విదేశీ మార్కెట్లలో జోరు కారణంగా బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు కూడా పెరిగాయి. ఆ క్రమంలో ఆసియా మార్కెట్లలో కూడా మార్పులు కనిపించాయి.
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో బంగారం ధర 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ.61,650కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్లో 10 గ్రాముల బంగారం ధర రూ.60,900 వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర కూడా కిలోకు రూ.500 పెరిగి రూ.74,700కి చేరుకుంది.
విదేశీ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయని హెచ్‌డిఎఫ్‌సి(HDFC) సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. ఆ క్రమంలో బంగారం ఔన్స్ $ 1,980 వద్ద ట్రేడ్ కాగా..వెండి కూడా యుఎస్‌లో వేగంగా ట్రేడవుతోంది. ఔన్సుకు $ 23.20. ఇక మిడిల్ ఈస్ట్‌లో భౌగోళిక రాజకీయ అశాంతిపై ఆందోళనల కారణంగా కామెక్స్ స్పాట్ గోల్డ్ శుక్రవారం దాదాపు నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరుకుందని సౌమిల్ గాంధీ అన్నారు.