Interest Rates: వడ్డీ రేట్లలో (Interest Rate) మార్పు లేదని ఆర్బీఐ స్పష్టంచేసింది. మరి కొన్నాళ్లూ వడ్డీ రేట్లు అలానే కొనసాగుతాయని తేల్చిచెప్పింది. అన్ని రకాల లోన్లపై సేమ్ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ఎన్నిరోజులు ఇలా కొనసాగుతుందని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే కాలమే సమాధానం చెప్పాలని అన్నారు.
ద్రవ్యోల్బణం కట్టడికి గత ఏడాది మే నుంచి 250 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు పెంచడంతో వడ్డీ రేట్లు గరిష్టానికి చేరాయి. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతంగా ఉంది. మరోవైపు రూ.వెయ్యి కొత్త నోటు మార్కెట్లోకి తీసుకొస్తారనే ప్రచారం జరుగుతోంది. అదేం లేదని శక్తికాంత దాస్ ఇదివరకే స్పష్టత ఇచ్చారు.
2016 నవంబర్లో రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. తర్వాత ఇటీవల రూ.2 వేల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. దీంతో ఇప్పుడు రూ.500 పెద్ద నోటుగా ఉంది. ఇంతలో రూ.వెయ్యి నోటు మళ్లీ తీసుకొస్తారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అదేం లేదని ఆర్బీఐ మరోసారి క్లారిటీ ఇచ్చింది. ద్రవ్యోల్బణం పరిస్థితుల దృష్ట్యా వడ్డీ మాత్రం కంటిన్యూగా ఉంటుందని.. వడ్డీ రేట్లలో మార్పు లేదని శక్తికాంత దాస్ అంటున్నారు.