మన దేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం నానాటికీ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి దింపుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగా లెక్ట్రిక్స్(Lectrix) సంస్థ ఎల్ఎక్స్ఎస్ 2.0 (LXS 2.0 ) పేరుతో మరో ఈవీని మార్కెట్లోకి తాజాగా విడుదల చేసింది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 98 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం ఉన్న వారికి ఇది మంచి ఆప్షన్ అని చెబుతోంది.
ఫీచర్లు ఇలా :
లెక్ట్రిక్స్ సంస్థ ఇంతకు ముందే ఎల్ఎక్స్ఎస్ 3.0 ఈవీని విడుదల చేసింది. దాని తర్వాత ఇప్పుడు ఈ 2.0ని విడుదల చేసింది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. బీఎల్డీసీ హబ్ మోటార్ ఈ వెహికిల్‌లో ఉంది. దీని టాప్ స్పీడ్ 60 కేఎంపీహెచ్. 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, ఫాలో మీ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్, 90/100 ఫ్రెంట్, 110/90 10 ఇంచుల టైర్స్‌తో ఈ స్కూటర్ మంచి లుక్‌తో ఉంది. ఇందులో యాంటీ థెఫ్ట్ సిస్టెమ్ కూడా ఉంది. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ కూడా ఉంది.
లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 79,999గా ఉంది. బుకింగ్స్ మొదలయ్యాయి. మార్చ్‌లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇది కొన్న వారికి సంస్థ 3ఏళ్లు లేదా 3000 కి.మీల వరకు వారెంటీని ఇస్తోంది. డోర్ స్టెప్ సర్వీస్‌ని కూడా ఇస్తామని సంస్థ చెబుతోంది.ఈ విషయంపై కంపెనీ సీఈఓ మాట్లాడుతూ వినియోగదారుల చెల్లించే డబ్బుకు తగిన విలువను మేం జోడించాలని అనుకున్నాం. అందుకనే దీని నాణ్యత విషయంలో రాజీ పడలేదని చెప్పారు.