Laal Salaam Movie Review: లాల్ సలామ్ హిట్టా? ఫట్టా?
సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఆయన కూతురు ఐశర్వ రాజేష్ దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కిన తాజా చిత్రం లాల్ సలామ్. జైలర్ చిత్రం తరువాత రజనీ నటించిన మూవీ కావడంతో లాల్ సలామ్‌పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ థియేటర్ వద్ద ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ వీడియోలో చూద్దాం.
సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్రలో ఆయన కూతురు ఐశర్వ రాజేష్ దర్శకత్వంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కిన తాజా చిత్రం లాల్ సలామ్. జైలర్ చిత్రం తరువాత రజనీ నటించిన మూవీ కావడంతో లాల్ సలామ్‌పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ థియేటర్ వద్ద ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ వీడియోలో చూద్దాం.
కథ:
1990 కాలంలో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సంతోషంగా ఉండే కసుమూరులో జరిగే కథ. ఆ ఊరిలో పుట్టి పెరిగిన మొయిద్దీన్(రజనీకాంత్) ముంబయి వెళ్లి పెద్ద వ్యాపార వేత్తగా ఎదుగుతాడు. ఆయన కొడుకు షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్‌ను చేయాలనేది ఆయన కల. మొయిద్దీన్ ఊరు విడిచి వెళ్లాక రాజకీయ నాయకుల కుట్రలతో ఊర్లో మతపరమైన గొడవలు మొదలౌతాయి. దాంతో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోతారు. అదే గ్రామంలో త్రీస్టార్ – ఎంసీసీ టీమ్స్ మధ్య క్రికెట్ ఆట పేరుతో గొడవలు పడుతారు. రెండు జట్ల నడుమ గొడవలో షంషుద్దీన్ చేతిని గురునాథం (విష్ణు విశాల్) నరికేస్తాడు. గురుకు, షంషుద్దీన్‌కు ఉన్న గొడవ ఏంటి? ఆ తర్వాత ఏమైంది? విషయం తెలుసుకున్న మొయిద్దీన్ ఏం చేశాడు? ఊరిలో గొడవలకు ఎప్పుడు పుల్ స్టాప్ పడింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో, మానవత్వాన్ని అందరితో పంచుకో అనేది మూవీ థీమ్. ఇదే డైలాగ్ ట్రైలర్లో రజనీకాంత్ చెప్పారు. ఇలాంటి సందేశాత్మకమైన కథలు చాలానే వచ్చాయి. ఈ సినిమాలో క్రికెట్, విలేజ్ బ్యాగ్డ్రాప్లో రాజకీయా గొడవలు చూపించే ప్రయత్నం చేశారు. వీటికి తోడు ఊళ్లో జాతర అనేది మరో ప్లాట్. వీటిని సరిగా హ్యాండిల్ చేయడంలో దర్శకురాలు తడబడింది. ప్రథమార్ధం మొత్తం చాలా కనిఫ్యూషన్గా కథ సాగుతుంది. రజనీకాంత్ పోర్షన్ ఆకట్టుకుంది. అయితే మధ్యలో వచ్చే లవ్ ట్రాక్, పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఊళ్లో జరిగే జాతరకు ఓ రథంను తీసుకొస్తారు. రాజకీయ కుట్రలో భాగంగా దాన్ని జాతర పూర్తి అవకముందే తీసుకెళ్లిపోతారు. సెకండ్ ఆఫ్ మొత్తం రథం చుట్టూనే తిరుగుతుంది. గురుకు, షంషుద్దీన్‌కు ఉన్న వైరం అంతగా పండలేదు. రజనీకాంత్ వచ్చాకా కాస్త ఊపిరి పీల్చుకున్న ప్రేక్షకుల ఆ తరువాత వచ్చే సీన్లకు పెద్దగా కనెక్ట్ అవరు. ఇక క్లైమాక్స్ కొత్తగా ట్రై చేశారు కానీ అది కూడా పెద్దగా వర్క్ అవుట్ అవలేదు.
ఎవరెలా చేశారు:
రజనీకాంత్ నటన గురించి చెప్పేది ఏమింటుంది. ఆయన తెరమీద కనిపించినంత సేపు ప్రేక్షకుల్లో ఓ ఉత్సాహం ఉంటుంది. గురునాథం పాత్రలో విష్ణు విశాల్ మెప్పించాడు. విక్రాంత్, సెంథిల్, తంబి రామయ్య, నిరోషా తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. హీరో తల్లి పాత్రలో జీవిత పరువాలేదు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకురాలు తడబడం క్లియర్‌గా అర్థం అవుతుంది.