మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. దీంతో భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది ఈగల్. మరి ఈ సినిమా ఎలా ఉంది? సీక్వెల్ టైటిల్ ఏంటి?
Raviteja: గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్, నా సామిరంగా సినిమాలతో పాటు సంక్రాంతికి ఈగల్‌గా రావాల్సిన మాస్ మహారాజా రవితేజ.. సంక్రాంతి రేసు నుంచి స్వచ్ఛంధంగా తప్పుకోని మిగిలిన సినిమాలకి థియేటర్స్ ఇచ్చాడు. దీంతో చెప్పినట్టుగానే ఫిబ్రవరి 9న తెలుగు నుంచి సోలోగా థియేటర్స్ లోకి వచ్చాడు మాస్ రాజా. మొన్న రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్‌తో అంచనాలు పెంచేయడంతో.. ఈగల్ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ అంతా ఈరోజు థియేటర్స్‌కి వెళ్లిపోయారు. అందుకు తగ్గట్టే.. ఈగల్ టాక్ నడుస్తోంది.
ఈగల్ సినిమాతో రవితేజ కంబ్యాక్ ఇచ్చాడని అంటున్నారు. సినిమా బాగుంది, ఫైట్స్ అదిరిపోయాయి, రవితేజ లుక్ బాగుంది.. సహదేవ్ వర్మగా అదరగొట్టాడు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఫస్టాఫ్ కాస్త తడబడినా.. సెకండాఫ్ మాత్రం బాగుందని అంటున్నారు. దీంతో ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజ ఖాతాలో మరో హిట్ పడినట్టేనని అంటున్నారు. చివరగా రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో డిజప్పాయింట్ చేసిన రవితేజ.. ఈగల్ తో ఫ్యాన్స్‌ని ఖుషి చేశాడని అంటున్నారు.
అంతేకాదు.. ఈగల్ క్లైమాక్స్‌లో పార్ట్ 2 కూడా ఉందని అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్‌కు ‘ఈగల్ 2-యుద్ధకాండ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. దీంతో మాస్ రాజా నుంచి రాబోతున్న ఫస్ట్ సీక్వెల్‌గా ఈగల్ నిలవనుంది. ఈగల్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా.. అనుపమా పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. మరి ఈగల్ అసలు రిజల్ట్ తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలాగే ఈగల్ 2 ఎప్పుడుంటుందో చూడాలి.