ATP: సుబ్బరాయ సాగర్ ప్రాజెక్టు గేటు మరమ్మతులు పూర్తి కావడంతో దాన్ని పూర్తిగా నీటితో నింపుతున్నట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. ఈ ప్రాజెక్టు నుంచి పుట్లూరు, కోమటికుంట్ల, బొప్పేపల్లి చెరువులకు నీటిని అందిస్తామని పేర్కొన్నారు. దయ్యాలకుంటపల్లి వద్ద హెచ్.ఎల్.సి కాలువలను స్వయంగా పరిశీలించి, నీటి సరఫరాపై అధికారులకు సూచనలు చేశారు.