అన్నమయ్య: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం కలికిరికి రానున్నారని మండల బీజేపీ అధ్యక్షుడు బాబుల్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12:45గం.లకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని చెప్పారు. అక్కడ నుంచి బయలుదేరి కలికిరి బీజేపీ కార్యాలయానికి చేరుకుంటారని వివరించారు.