CTR: తవణంపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందారు. తిరుపతి-బెంగళూరు హైవేపై వెళ్తున్న కారు కె.పట్టుం బ్రిడ్జి వద్ద శుక్రవారం సాయంత్రం లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో అదుపు తప్పి లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న కోమల(40), ఆమె కుమారుడు వర్ధన్ గౌడ్(11) తీవ్రంగా గాయపడి మృతిచెందారు.