సూపర్ స్టార్ రజనీ కాంత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని జైలర్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టి.. రజనీ సత్తా ఏంటో ప్రూవ్ చేసింది. దీంతో జైలర్ సీక్వెల్‌గా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Rajanikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ గత ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద విజయం సొంతం చేసుకుంది. రజినీ కాంత్ స్టైల్‌కు అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్‌కు థియేటర్ టాపులు లేచిపోయాయ్. తెలుగులోను మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర 650 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జైలర్ 2కి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే.. ఈ సీక్వెల్‌కు టైటిల్ మారినట్టుగా చెబుతున్నారు. జైలర్ సినిమాలో హుకుం అనే సాంగ్ బాగా పాపులర్ అయింది. దీంతో ఇప్పుడు హుకుం అనే పదాన్ని టైటిల్‌గా ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే దీనికి సూపర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ప్రస్తుతం స్క్రిప్ట్‌లో రజనీ చెప్పిన కొన్ని కీలక మార్పుల మీద వర్క్ చేస్తున్నాడట. వన్స్ స్క్రిప్టు లాక్ అయ్యాక.. షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. జూన్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది జనవరిలో మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారట.
త్వరలోనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 171వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు రజనీ కాంత్. ఈ సినిమా అయిపోగానే జైలర్ సీక్వెల్‌గా రానున్న ‘హుకుమ్’ని మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా జైలర్‌ని మించేలా మరింత గ్రాండియర్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈసారి సూపర్ స్టార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.