Allu Arjun: ఒకటి కాదు.. 2 సినిమాలు ప్లాన్ చేస్తున్న అల్లు అర్జున్?
ఈసారి పుష్పగాడు చేయబోయే రచ్చకు రీసౌండ్ వచ్చేలా పుష్ప2 రాబోతోంది. అయితే.. పుష్ప2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ ఒకేసారి రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.
Allu Arjun: ఆగష్టు 15న రిలీజ్ కానున్న పుష్ప2 సినిమా పై భారీ హైప్ ఉంది. సుకుమార్ ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దక్కించుకొని యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక పుష్ప2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పటికే త్రివిక్రమ్‌తో పాటు సందీప్ రెడ్డి వంగతో సినిమాలు ప్రకటించాడు బన్నీ. అయితే.. సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది.
దీంతో నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అనుకుంటున్నారు. కానీ ఈలోపు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ లైన్లోకి వచ్చాడు. ఇంకా ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అయినా కూడా త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో ఉండదని అనుకున్నారు. కానీ బన్నీ బర్త్ డే సందర్బంగా త్రివిక్రమ్ సినిమా ఉంటుందని మరోసారి కన్ఫామ్ చేశారు మేకర్స్. అలాగే.. అట్లీ సినిమా కూడా ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఈ రెండింటిలో ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్తుందనే విషయంలో క్లారిటీ లేదు.
కానీ ఒకేసారి అటు అట్లీ, ఇటు త్రివిక్రమ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడ అల్లు అర్జున్. త్వరలోనే అట్లీ సినిమాను సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయనున్నాడట. అంతేకాదు.. వచ్చే ఏడాదిలోనే ఈ రెండు సినిమాలను విడుదల చేసేలా బన్నీ ప్లాన్ చేస్తున్నాడట. ఇదే నిజమైతే.. బన్నీ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు.