కర్నూల్‌కు చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే వివాహం చేయాలనుకున్నారు. కానీ ఆ బాలిక చదువుకుంటాను. ఐపీఎస్ కావాలని అనుకుంటున్నాని చెప్పి పెళ్లి చేసుకోలేదు.
Karnool: పూర్వకాలంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరిగేవి. కుటుంబ పరిస్థితుల వల్ల ప్రస్తుతం కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అయితే కర్నూల్‌కు చెందిన ఓ యువతికి తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే వివాహం చేయాలనుకున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదోని మండలానికి చెందిన నిర్మల అనే బాలిక చదువులో ఫస్ట్. కానీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.
దీంతో తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలని అనుకున్నారు. దీనికి నిర్మల ఒప్పుకోలేదు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పింది. దీంతో ఆ బాలిక స్థానిక అధికారులను సంప్రదించగా.. కేజీబీవీలో చేర్చారు. ప్రభుత్వ అండతో నిర్మల చక్కగా చదువుకుంది. నిన్న విడుదల అయిన ఇంటర్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచింది. బైబీసీ గ్రూప్‌కి చెందిన నిర్మల 440కి 421 మార్కులు సంపాదించింది. ఆమెను అధికారులు అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనేది నిర్మల జీవిత లక్ష్యం.