Diamonds: తొలకరి జల్లులు కురిస్తే కర్నూలు జిల్లాలోని రైతులు పులకరిస్తారు. అప్పటి వరకు సామాన్యులుగా ఉండే రైతులు రాత్రికి రాత్రే లక్షాధికారులవుతారు. అదేంటి అనుకుంటున్నారా..నిజమే అక్కడ వర్షాలు కురిస్తే పొలాల్లో వజ్రాలు దొరుకుతాయి. అందుకే రాయలసీమ రతనాల సీమని అంటారు. తాజాగా ఓ రైతుకు ఒకే రోజు రెండు వజ్రాలు దొరికాయి. మాములుగానే ఈ తంతు ప్రతీ ఏడాది జరుగుతుంది కాబట్టి అక్కడే ఉండే వ్యాపారు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. విలువ వజ్రాలు దొరకగానే రైతులకు ఎంతో కొంత ఇచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. వాటిని వారు మార్కెట్ రేట్లకు అమ్ముకొని లాభాలు గడిస్తారు. తాజాగా మదనంతపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు ఇటీవల రెండు వజ్రాలు దొరికాయి. వాటిని ఏకంగా రూ. 15 లక్షలకు అమ్మినట్లు తెలుస్తుంది.
పూర్తి వివారాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. వాటిని పొలం యజమానికి ఇచ్చారు. దాని విలువ తెలిసిన యజమాని వజ్రాల వ్యాపారితో మాట్లాడి ఒక వజ్రాన్ని రూ. 6 లక్షలు, 6 తులాల బంగారానికి ఇచ్చేశాడు. ఇంకో వజ్రం సుమారు రూ. 12 లక్షల వరకు పలుకుతుందని చెప్పారు. ఆయన పొలంలో పనికి వచ్చిన కూలీలకు కూడా తాను కొంత మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరికే కాకుండా వారం రోజుల్లోనే 10 వజ్రాలు దొరికినట్లు సమాచారం. దీంతో స్థానికులు వజ్రాల వేట కొనసాగిస్తున్నారు.