ELR: చింతలపూడి సబ్ జైలును జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. రత్న ప్రసాద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఖైదీల సమాచారం తెలుసుకుని వారికి అందుతున్న ఆహారం, నీరు తదితర విషయాలపై ఆరా తీశారు. ఆనారోగ్యంతో ఉన్న వారికి పలు సూచనలు చేశారు. ఖైదీలకు ఏమైనా న్యాయ సలహాలు కావాలంటే జైలు ప్రాంగణంలో ఉన్న ఉచిత న్యాయ సలహా కేంద్రంలో తీసుకోవచ్చు అని తెలిపారు.