కోనసీమ: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం జనవరి 28న నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. అమలాపురంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. 29న రథోత్సవం, ఫిబ్రవరి 1న చక్రస్నానం, 2న తెప్పోత్సవం జరుగనున్నాయని తెలిపారు. ఉత్సవాల దృష్ట్యా జనవరి 26 నుంచి ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.