NDL: బేతంచెర్ల మండలంలో మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు స్వామి వారి సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు పేద పండితులు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గజవాహనంపై స్వామి వారిని ఆలయ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు.