NRPT: దేశ సేవలో పాల్గొన్న మాజీ జవాన్ సంజీవ్ మృతి బాధాకరమని సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మాగనూరు మండలం కొత్తపల్లి గ్రామంలోని సంజీవ్ నివాసానికి వెళ్లిన మంత్రి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూ. లక్ష నగదును అందజేసి, భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.